చూసా ..!! నిను చూసా..!!
చిగురాకుల చిరు ఆశలు
తొలి కిరణాలకు పులకించిన ఉదయపు చందంలో
చూసా ..!! నిను చూసా..!!
ఆ పుత్తడి తోరాలను తమ ఒంటికి చుట్టుకుని,
మురిసి మెరిసిపోయే .. ప్రకృతి ప్రతి రూపంలో
చూసా ..!! నిను చూసా..!!
మృదురేఖల అరమరికల తెరతీస్తూ ,
వికసించే సుమగంధపు మందారాల ..అపురూపంలో
చూసా ..!! నిను చూసా..!!
కల కోయిల పదకోమల సుధ వీణపై
మధురంగా పల్లవించే..ఆమని అనురాగంలో..
చూసా ..!! నిను చూసా..!!
తెల తెల పాల నురగల మిలమిల అద్దుకుని,
నీలి నింగిలి ముంగిట్లో, వేల ముగ్గులు వేస్తోన్న...
ఆఘమేఘాల పరుగుల్లో..
చూసా ..!! నిను చూసా..!!
కరిమబ్బుల తొలకరి విరి జల్లుకు..,
తడినేలను విడిచి, విడిది చేస్తోన్న ..మట్టి సువాసనలో
చూసా ..!! నిను చూసా..!!
వెన్నెల దివిటీలు వెలిగించి..
కళ్ళ లోగిళ్ళలో ..పసిడి కాంతులు నింపి ,
కలలలోకాలను కనులారా పండిస్తోన్న... ,
వెండి నవ్వుల జాబిలి వెన్న వన్నెల్లో...
చూసా..!! నిన్ను చూసా..!!
అల్లసాని పల్లవిలో అల్లుకున్న అల్లరి వల్లరిలా
నడుమూపుతూ నయగారంగా..సొగసూపుతూ ..సింగారంగా..,
కడవెత్తిన గొల్లభామ, కట్టు తప్పిన వలయాలలో...
సిగ్గు సిగ్గంటూ..చూసా..!! నిన్ను చూసా..!!
హద్దు మీరిన ప్రేమ, ముద్దులూరగా...,
ముదిత ముంజేతి మువ్వల మేళాలు ..
భళా..భళా అంటాయని...
శిల లాంటి కలాన్ని వదిలి సిరాజితాలై సుమిస్తోన్న...
ఈ సొగసు కలువల కవితల్లో..
చూసా..!! నిన్ను చూసా..!!
మైకం కమ్మిన ఆ మోహన విహారంలో
చేష్టలుడిగి...చంద్రహాసంతో..
నిను చూస్తూ.....అలాగే ఉండిపోయా.......!!
సాక్షిగా నిలిచిన ..ఆ శుభఘడియ
నాలో ఒక జ్ఞాపకంగా ..ఇమిడిపోయింది..!!
చిగురాకుల చిరు ఆశలు
తొలి కిరణాలకు పులకించిన ఉదయపు చందంలో
చూసా ..!! నిను చూసా..!!
ఆ పుత్తడి తోరాలను తమ ఒంటికి చుట్టుకుని,
మురిసి మెరిసిపోయే .. ప్రకృతి ప్రతి రూపంలో
చూసా ..!! నిను చూసా..!!
మృదురేఖల అరమరికల తెరతీస్తూ ,
వికసించే సుమగంధపు మందారాల ..అపురూపంలో
చూసా ..!! నిను చూసా..!!
కల కోయిల పదకోమల సుధ వీణపై
మధురంగా పల్లవించే..ఆమని అనురాగంలో..
చూసా ..!! నిను చూసా..!!
తెల తెల పాల నురగల మిలమిల అద్దుకుని,
నీలి నింగిలి ముంగిట్లో, వేల ముగ్గులు వేస్తోన్న...
ఆఘమేఘాల పరుగుల్లో..
చూసా ..!! నిను చూసా..!!
కరిమబ్బుల తొలకరి విరి జల్లుకు..,
తడినేలను విడిచి, విడిది చేస్తోన్న ..మట్టి సువాసనలో
చూసా ..!! నిను చూసా..!!
వెన్నెల దివిటీలు వెలిగించి..
కళ్ళ లోగిళ్ళలో ..పసిడి కాంతులు నింపి ,
కలలలోకాలను కనులారా పండిస్తోన్న... ,
వెండి నవ్వుల జాబిలి వెన్న వన్నెల్లో...
చూసా..!! నిన్ను చూసా..!!
అల్లసాని పల్లవిలో అల్లుకున్న అల్లరి వల్లరిలా
నడుమూపుతూ నయగారంగా..సొగసూపుతూ ..సింగారంగా..,
కడవెత్తిన గొల్లభామ, కట్టు తప్పిన వలయాలలో...
సిగ్గు సిగ్గంటూ..చూసా..!! నిన్ను చూసా..!!
హద్దు మీరిన ప్రేమ, ముద్దులూరగా...,
ముదిత ముంజేతి మువ్వల మేళాలు ..
భళా..భళా అంటాయని...
శిల లాంటి కలాన్ని వదిలి సిరాజితాలై సుమిస్తోన్న...
ఈ సొగసు కలువల కవితల్లో..
చూసా..!! నిన్ను చూసా..!!
మైకం కమ్మిన ఆ మోహన విహారంలో
చేష్టలుడిగి...చంద్రహాసంతో..
నిను చూస్తూ.....అలాగే ఉండిపోయా.......!!
సాక్షిగా నిలిచిన ..ఆ శుభఘడియ
నాలో ఒక జ్ఞాపకంగా ..ఇమిడిపోయింది..!!